![]() |
![]() |
.webp)
ప్రేమికుల రోజు తర్వాత ప్రేమికులలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే అప్పటి దాకా దూరంగా ఉన్నవాళ్ళు కలిసిపోతారు. ఆ తర్వాత కొంతమంది విడిపోతారు. ఇదే ప్రస్తుతం యంగ్ జనరేషన్ చేస్తోంది. దీనిపై గీతు రాయల్ కొన్ని కామెంట్లు చేసింది.
మీరు రిలేషన్ షిప్స్ లోకి ఎంటర్ అయిన ఫస్ట్ సిక్స్ మంత్స్ లోనే.. ఈ రిలేషన్ నాతో జీవితాంతం ఉంటుందనే ఆలోచనకి వచ్చేయకండి ఎందుకంటే ఏ రిలేషన్ షిప్ అయిన.. మొదట ఆకర్షణ, రొమాన్స్ అన్నీ ఆ ఫేజ్ లో ఉంటాయి. దాని తర్వాత వాళ్ళు ఏ నిమిషంలో ఎట్లుంటారో మొత్తం తెలిసాక.. మొత్తం చూసేసాక.. ఇక తెలుసుకోవడానికి ఇంకా ఏం లేదు అన్నప్పుడు వాళ్ళలో అప్పటికి దాకా ఉన్న కొత్తదనం వేరే వారి మీదకి షిఫ్ట్ అవుతుంది. అందుకే ఆరు నెలల తర్వాత కూడా అదే ఫీల్ మీ పార్టనర్ మీద ఉంటే మీది ట్రూ లవ్.. కానీ అలా ఎవరు ఉండరు. కొంతమంది మాత్రమే అలా ఉంటారని గీతు రాయల్ ఓ వీడియోలో చెప్పుకొచ్చింది.
గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున.
![]() |
![]() |